ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే.. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని చంద్రబాబు ట్వీట్ లో తెలిపారు.
Read Also: HanuMan : మరి కొద్దిగంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్ హిందీ వెర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని తెలిపింది.
Read Also: Lok Sabha Elections 2024: ఏ రాష్ట్రంలో.. ఏ దశలో పోలింగ్..?