ఇసుక పాలెంలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ-జనసేన సైనికులు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతా జనం వచ్చి, దారి పొడవునా నీరాజనాలు పలికారు. బాణా సంచాల మోతలతో ఇసుకపాలెం పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా.. కాకర్ల సురేష్ రైతు కూలీలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగ అవుతుంది, రైతుల కష్టం తీరుతుందని అన్నారు.
పల్లె పల్లెకు కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ హాజరయ్యారు. మరోవైపు.. కాకర్లను చూసేందుకు పల్లె జనం భారీగా తరలివచ్చారు. యువ నాయకుడా నీవే కావాలంటూ అక్కచెల్లెమ్మలు కాకర్లతో చెప్పారు. మండుటెండలోను అదే జోరు.. అదే హోరు కనబరిచారు. నీ వెంటే మేమంతా అంటూ ఐదు కిలోమీటర్లు కాకర్లతో నడిచారు పల్లె జనం.
తెలుగుదేశం జిందాబాద్.. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి.. ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి కోటపై ఎగిరేది పసుపు జెండానే, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ప్రజానీకం అంటున్నారు.. అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అవ్వ, తాత అంటూ ఆప్యాయత పలకరింపులతో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహిస్తున్నారు.