కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. నగర శివార్ల నుంచి బస్సులు, ఇతర వాహనాల దారి మల్లింపులు ఉంటాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల.…
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు.
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.