AP Assembly & Lok Sabha Exit Poll 2024, AP Elections 2024, AP Assembly Exit Poll 2024, Lok Sabha Exit Poll 2024, YSRCP, TDP-Janasena-BJP, Congress, INDIA
ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది…
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు..
Ap Election Counting: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలయింది. జూన్ 4న ఫలితాలు వెల్లువడగా ఓట్ల లెక్కింపు కోసం పక్క ప్రణళికతో ఈవీఎంలు భద్రపరచాలని కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరాలను అనుమతించొద్దని ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఆదేశాలు జేరి చేసారు. కౌంటింగ్ సమయంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు జరగకుండా చూడాలి అని పోలీస్ వారికీ విజ్ఞాప్తి చేసారు. ఇక ఏపీ ఫలితాల సమాచారం కొరకు కింద వీడియో క్లిక్ చేయండి….
పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది.
కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందు కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ( గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.