జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లను జీఏడీ హ్యాండోవర్ చేసుకోనుంది
ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 17 నుంచి 26 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందన్నారు.
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు.