ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలులో రేపు లెక్కింపు జరగనుంది. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో అనంతపురం, ఉరవకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరగనుంది.
తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.
కౌంటింగ్ రోజున విజయోత్సవాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.. ఏపీ సీఈవో ఎంకే మీనా.. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 92 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. రేపు ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా హాల్స్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న చోట ఈవీఎంలు కౌంటింగ్ కూడా 8 గంటలకే…
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.