ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత బాబు ను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్,అసెంబ్లీ సెక్రటరీ కి సమాచారం ఇచ్చారు కాకినాడ పోలీసులు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పోలీసు కస్టడీలో ఉన్నారని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు. పోలీస్ కష్టడీని నిర్థారించారు అడిషనల్ ఏస్పీ శ్రీనివాస్. అనంతబాబుని ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ విచారిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అత్యంత గోప్యంగా వుంచుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో లభ్యమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఐదు నెలల క్రితమే ఆయన వద్ద డ్రైవర్‌గా పని చేసి వదిలేసిన సుబ్రహ్మణ్యం.. రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబీకులు చెప్పారు. నెలకు ఐదు వేలు చొప్పున డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనంత బాబు తమని హెచ్చరించాడని వాళ్ళు తెలిపారు. అయితే, నిన్న రాత్రి…
ఏపీలో రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచార ఘటనలు, హత్యలు పెచ్చుమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా బాపట్ల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వేమూరు మండలం చావలి గ్రామంలో వాలంటీర్‌గా పని చేస్తోన్న శారద అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందని పద్మారావు అనే వ్యక్తి ఆమెను హతమార్చాడు. కొన్నాళ్ళ క్రితం శారద, పద్మారావుకి ఏర్పడిన పరిచయం.. వివాహేతర…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు.…