Suryalanka Beach Incident: సూర్యలంక బీచ్‌లో ఆరుగురు మృతి.. ప్రభుత్వం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt Fires On Police Officials Over Suryalanka Beach Incident: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ వరుస విషాదాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థుల్లో ఆరుగులు మృత్యువాత పడ్డారు. విజయవాడకు చెందిన మొత్తం ఎనిమిది విద్యార్థులు బీచ్‌లో స్నానం చేస్తుండగా.. నీళ్లలో మునిగిపోయారు. ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు కానీ, మిగిలిన ఆరుగురే గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు కొట్టుకురాగా.. మరో ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు వెలికి తీశారు. కానీ, ఇంకో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సూర్యలంక తీరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించిన ప్రభుత్వం.. 24 గంటల పాటు పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పింది. ప్రమాదాలు చోటు చేసుకుంటే, వెంటనే చర్యలు తీసుకునే విధంగా అలర్ట్‌గా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. సరదాగా సమయం గడిపేందుకు బీచ్‌కు వచ్చిన తమ పిల్లలు ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో తమకు తోడుగా ఉంటారన్న పిల్లలకు తామే పాడే కట్టాల్సిన దౌర్భాగ్యం వస్తుందని ఊహించలేదంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
కాగా.. సూర్యలంక బీచ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది ఇలాగే విహారయాత్రకు వచ్చి, సముద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!