జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది.
బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ 1,25,995 కోట్లు ఎక్కువ వచ్చింది.ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంది.పని తీరులో, వివిధశాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉంది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఏపిపై తక్కువే.రెవిన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోయాయి.
ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ 51,500 కోట్లకు పెరిగాయి.ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ 54 వేల కోట్ల నుంచి రూ 1,18,565 కోట్లకు పెంచేశారు.వివిధ శాఖలకు అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ కేటాయింపులను గాలికి వదిలేశారు.అసెంబ్లీ గౌరవాన్ని మంటగలిపారు.సహజ వనరులను జె గ్యాంగ్ నిలువు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీసే దుస్థితికి తెచ్చారు.