Gautam Sawang Transfer: ఏపీ డీజీపీ గా రాజేంద్రనాథ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించేందుకు రంగం సిద్ధం అయింది. పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే.
లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. కాసేపట్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బదిలీకి సంబంధించి ఇంతవరకు అధికారులెవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం.
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!

గతంలో డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి 2019లో గౌతమ్ సవాంగ్ ని డీజీపీకి నియమించింది ప్రభుత్వం. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. అలాగే హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా పనిచేశారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!