ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు.
డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ రమేష్, అజేయకల్లాంలను పొమ్మనకుండా పొగబెట్టారు. అజేయకల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించి తర్వాత పంపేశారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్ ప్రకాశ్ ను ఆకస్మికంగా ఢిల్లీ తరిమేశారు. జగన్ వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలన్నారు.
ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మి భారీగా ఆదాయం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు.జగన్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసింది.కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలన్నారు.