అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.
విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు.
సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు.
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి చర్చ సాగుతోంది.. విశాఖలోనే కాపురం పెడతా.. అక్కడి నుంచి పాలన సాగిస్తామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత.. విపక్షాలు దానిపై కౌంటర్ ఎటాక్ చేశాయి.. అయితే, ఆ వ్యాఖ్యలు తిప్పుకొడుతూనే.. రాజధాని వైజాగే అని స్పష్టం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అక్కడి నుండే పాలన సాగనుంది అన్నారు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్ డే..…
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తాను.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. ఇక, ఉద్దానం కిడ్నీ సమస్యల…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే ఉద్దేశ్యంతోనే బెజవాడలో మూడు ఫ్లైఓవర్లు…