ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు.. ఇవాళ ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నరు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. వెలగపూడిలోని సచివాలయం ఆవరణలో మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది.. తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు 11 మంది పాత మంత్రులు.. మొత్తం 25 మందితో…
రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,…
బీసీలను ఓటుబ్యాంకుగా భావించే పార్టీలకు భిన్నంగా 2019లో సీఎం జగన్ బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి కొత్త సంప్రదాయం నెలకొల్పారు. పేదలకు తాయిలాలు ఇవ్వడమే కాకుండా సీఎం జగన్ పాలనలో భాగం ఇచ్చారన్నారు సజ్జల. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎప్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తోంది. తొలి కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారు. బీసీల్లో ఆత్మస్థయిర్యం పెంచాం. ఈసారి 25మందిలో 70 శాతం మంది బడుగు, బలహీనవర్గాల వారే.…
పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. జాబితా ఫైనల్ చేశారు సీఎం జగన్. కాసేపట్లో గవర్నర్ వద్దకు పంపనున్నారు మంత్రుల జాబితా. అన్నీ ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ కృష్ణా: జోగి రమేష్…
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు. బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు.…
సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్‌కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
ఏపీలో కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ నేతలు. ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కొనసాగించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. వరుసగా రెండో రోజు మూడు గంటల పాటు కొనసాగింది సమావేశం. దాదాపుగా కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమయిందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్…