వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి మరోసారి వరించింది.. విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖలను పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్.. ఇవాళ సచివాలయంలోని మూడో బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం జగన్ కేటాయించిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా.. రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు…
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల కోసం తాము ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరగడం లేదన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అన్నారు. బాబులా పదవుల కోసం స్వంతమామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మేం పార్టీకోసం పనిచేస్తాం అన్నారు. కేబినెట్లో తమను తీసేశారంటే.. నా మనుషులు.. వీరిని తీసినా ఏం ప్రాబ్లం వుండదని భావించారన్నారు. సింపతీ కబుర్లకు ప్రలోభాలకు గురికావద్దన్నారు కొడాలి నాని. ఆయన వెంట సైనికుడిలా నిలబడతాం. జగన్ నిర్ణయం వెనుక…
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చినవారు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పదవి ఆశించి నిరాశకు గురైనవారు అలకబూనారు.. అయితే, మంత్రి పదవి దక్కినవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. తొలిసారి మంత్రివర్గంలో అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఇదే సమయంలో.. గతంలో హోంమంత్రిగా మహిళే ఉండడంతో.. ఇప్పుడు కూడా ఆ పదవి మహిళకే ఇస్తారని.. కాబోయే హోంమంత్రి ఆర్కే రోజాయే అంటూ ప్రచారం సాగుతోంది.. రోజాకే హోంమంత్రి పదవి ఇవ్వాలంటూ…
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గంలో చోటు దక్కినవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు పదవి కోల్పోయినవారు, ఈసారైనా మంత్రి పదవి వస్తుందని ఆశించి నిరాశకు గురైనవారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీపై ఆయన అలకబూనారు.. ఇక, అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలినేని ఇంటికి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.. అయితే,…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో పదవిని ఆశించి నిరాశకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మలివిడతలోనూ స్థానం దక్కలేదు.. దీనిపై తీవ్రమైన ఆవేదనకు గురైన కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఎంతో అనుబంధం కలిగి ఉన్నానని, టీడీపీ హయాంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్న ఆయన.. జగన్ ఓదార్పు యాత్రలో ఎంతో బాధ్యత మోశానని గుర్తుచేసుకున్నారు.. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే బాధ ఇంకా నాలో…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు.. ఇవాళ ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నరు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. వెలగపూడిలోని సచివాలయం ఆవరణలో మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది.. తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు 11 మంది పాత మంత్రులు.. మొత్తం 25 మందితో…
రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,…