ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు.. ఇవాళ ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నరు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. వెలగపూడిలోని సచివాలయం ఆవరణలో మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది.. తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు 11 మంది పాత మంత్రులు.. మొత్తం 25 మందితో కొలువు తీరబోతోంది నూతన మంత్రివర్గం.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు గవర్నర్ బిశ్వభూషణ్..
Read Also: LIVE : ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సుఖసంతోషాలతో కళకళలాడుతారు
కాగా, 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. 25 మందితో తొలి కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే, ముందుగా చెప్పినట్లు వారందరితో ఈనెల 7న రాజీనామా చేయించారు. కొత్తవారితో నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. 11 మంది సీనియర్లకు మంత్రివర్గంలో మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను కేబినెట్‌లో కొనసాగిస్తూ.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు… ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌కు మంత్రి పదవులు ఇచ్చారు.. ఇవాళ ప్రమాణస్వీకారం తర్వాత.. శాఖలు కేటాయించనున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.