ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు.. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్.. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై పూర్తి వివరాలను వెల్లడించారు.. ఈ నెల 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపిన ఆయన.. అదే రోజు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా…
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను జగన్ కోరనున్నారు. మరోవైపు ఈనెల 7న ప్రస్తుత కేబినెట్‌తో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.. రాష్ట్రంలో పలు కార్యక్రమాలతో పాటు.. హస్తినబాట పడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొనాల్సి కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. చివరకు ఈ నెల 7వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం సమయాన్ని కూడా మార్చేశారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. ఈ మార్పులు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. 6వ తేదీన సీఎం జగన్ పాల్గొనాల్సిన వాలంటీర్ల…
ఏపీలో ఈనెల 11న సీఎం జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. కేబినెట్‌లో మెజార్టీ మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్‌కు…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.. దీంతో.. ఎవరి పదవి ఊడిపోతుంది..? కేబినెట్‌లో మిగిలేది ఎవరు? మాజీలు అయ్యేది ఎంత మంది? కొత్తగా పదవి దక్కించుకునేది ఎవరు? ఇలా ఏపీలో అధికార వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.. అయితే, కేబినెట్ నుంచి తప్పించినంత మాత్రాన వాళ్లను పక్కనబెట్టినట్టు కాదు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. మాజీలు కానున్న మంత్రులతో సీఎం వైఎస్…
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన విషయం తెలిసిందే.. మరోవైపు… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి కాసేపటి కిత్రమే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్‌గా సమావేశమైన ఏపీ కేబినెట్..…
త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కేబినెట్‌లో కొందరు ఇళ్లకువైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే…