AP Cabinet: పాత మంత్రులకు పాత శాఖలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఉత్కంఠకు తెరపడింది.. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌ను మంత్రులుగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు. అయితే, గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుండగా.. మరోవైపు.. మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.. పాత మంత్రుల్లో కొందరికి పాత శాఖలు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు..
Read Also: Kakani Govardhan Reddy: కొందరికి బాధ ఉండొచ్చు.. అవసరం అయితే ఒక మెట్టు దిగుతా..
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
గతంలో మాదిరిగానే ఎస్సీ మహిళకే హోం శాఖ అంటూ ప్రచారం సాగుతోంది.. ఈ ఈక్వేషనులో తానేటి వనితకు హోం మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.. ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కొనసాగించనున్నట్టుగా తెలుస్తుండగా.. కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూతో పాటు మరో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది.. ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ గత శాఖలనే కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. అయితే, ఫస్ట్ కేబినెట్‌లో చోటు దక్కకపోయినా.. ఈ సారి మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజాకు ఏ శాఖ కేటాయించనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.. ఇక, కాకానికి వ్యవసాయం.. లేదా మరో కీలక శాఖ అని ఊహాగానాలు వినిపిస్తుండగా.. మంత్రుల శాఖల విషయంలో మధ్యాహ్నం లేదా సాయంత్రానికి క్లారిటి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం 11.31 గంటలకు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఐదు వేల మంది అతిథితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!