మంత్రి పదవులు కోల్పోయేది ఎవరు? కొత్తగా కేబినెట్‌లోకి అడుగుపెట్టేది ఎవరు?.. జగన్ మంత్రివర్గంలో ఎవరు కొనసాగే అవకాశం ఉంది..? అనే అంశాలకు తెరపడింది.. 11 మంది సీనియర్లకు మంత్రివర్గంలో మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను కేబినెట్‌లో కొనసాగించిన ఆయన.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌ను మంత్రులుగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎంలు ఎవరు? అనే చర్చ సాగుతోంది.
Read Also: AP New Cabinet: నేడు మంత్రుల ప్రమాణస్వీకారం
అయితే, గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది… మైనారిటీల నుంచి అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుండగా.. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర డిప్యూటీ సీఎం పదవి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక, ఎస్సీ నుంచి నారాయణ స్వామి లేదా పినెపి విశ్వరూప్ లేదా తానేటి వనిత..? ఆ అవకాశాన్ని దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తుండగా.. బీసీ నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్స సత్యనారాయణను ఆ అవకాశం వరించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాకు అవకాశం? ఉంటుందనే చర్చ సాగుతోంది. మరి కొత్త డిప్యూటీ సీఎంలు ఎవరో… మరికొన్ని గంటల్లో తెరపడనుంది.