ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…
కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉదయం సమావేశం అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేపింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వే విడుదలయింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. ఏపీలో యాన్యువల్ గ్రోత్ రేట్ 18.47 శాతంగా ఉంది.కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు…
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు. శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్…
తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుందని కామెంట్ చేసిన ఆయన.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బడ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్ లో ఎంతో కోత పెడుతోందన్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు…
ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. వెనక బడిన కులాలకు బడ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఇక ఏ…