కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉదయం సమావేశం అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేపింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వే విడుదలయింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది.
ఏపీలో యాన్యువల్ గ్రోత్ రేట్ 18.47 శాతంగా ఉంది.కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. దేశ ప్రగతి రేటు కంటే ఏపీ ప్రగతి ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లోనూ పురోగతి, ప్రగతి సాధించాం. పరిశ్రమలు, సేవా రంగాలు కూడా పుంజుకున్నాయి. తలసరి ఆదాయం ఏపీలో రూ. 31 వేలుగా వుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ లో కూడా ప్రగతి సాధించాం అని సర్వేలో తెలిపారు.