ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు ప్రభుత్వం పెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
AP Budget: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న గురువారం కొత్త పొద్దు పొడిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త పద్దు సమర్పించారు. 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. కీలక రంగాల్లో ఒకటైన సంక్షేమానికి అత్యధికంగా 51 వేల 345 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం.. వ్యవసాయానికి 41 వేల 436 కోట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత.. విద్యకు 32 వేల 198 కోట్ల రూపాయిలు…
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలి లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ఇవాళ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తున్నారు. రేపు ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి…
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి…