టీడీపీ మాక్ అసెంబ్లీపై పేర్నినాని సెటైర్లు.. అదో సురభి డ్రామా కంపెనీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుందని కామెంట్ చేసిన ఆయన.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా ఉత్పత్తి కంపెనీలు చెప్పాలి.. కానీ, చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకు ఏమన్నా వాటాలున్నాయా..? అని ఫైర్ అయిన ఆయన.. గ్లోబల్ టెండర్లల్లో పాల్గొనేందుకు టీకా కంపెనీలు సిద్దంగా ఉంటే చంద్రబాబుకొచ్చిన ఇబ్బందేమిటి..? అని ప్రశ్నించారు.
బడ్జెట్టులో సంక్షేమానికి పెద్ద పీట వేశామని వెల్లడించారు మంత్రి పేర్నినాని.. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ప్రజలకు సంక్షేమం అమలు చేస్తున్నామని గుర్తుచేసిన ఆయన.. తొలిసారి జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్, మైనార్టీల బడ్జెట్ ప్రవేశపెట్టామని వెల్లడించారు.. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలో జెండర్, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాం.. కాపు నేస్తం పథకాన్ని చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేస్తున్నాం అన్నారు.. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు మంత్రి పేర్నినాని.. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పిస్తున్నామన్న ఆయన.. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మేం తీరుస్తున్నామని.. రూ. 31 వేల కోట్లతో ఆస్తుల కల్పనకు నిర్ణయించామని పేర్కొన్నారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!