Minister Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదంగా ఉంది అన్నారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్‌కు డేట్ ఫిక్స్ చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంగా తెలుస్తోంది..
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తన దగ్గర డబ్బులు లేవని, కానీ నూతనమైన ఆలోచనలు మాత్రం ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం అని, ఆదాయం స్వీడ్‌గా వస్తుందన్నారు. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్, జీతాలు ఇస్తున్నాం అని.. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులు కాపాడతాం అని, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం అని…
సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు.
ఈరోజు అసెంబ్లీలో ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2.9లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేశవ్ నివాసానికి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు చేరుకుని బడ్జెట్ పత్రాలను మంత్రికి అందించారు.
నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.