తెలంగాణ-ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోడీ చెప్పారు.. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. మాపై విష ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన విమర్శించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మోడీ ఎవరినీ విమర్శించలేదు.. విభజన టైంలో పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అంశాల గురించే ప్రస్తావించారని క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. అయితే, అజెండాలో మార్పులు చేసింది.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా పోయింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వివాదాల అజెండాను ఖరారు చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్…
నిత్యం వార్తల్లో వుండే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. కర్నూలులో హనుమంతరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వి హనుమంతరావు. ప్రధాని మోడీ లేని పంచాయతీలు పెడుతున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్నవాళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా వున్నారు. ఆమె ఏం…
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చారిత్రక…