కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. అయితే, అజెండాలో మార్పులు చేసింది.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా పోయింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వివాదాల అజెండాను ఖరారు చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు చేసింది..
Read Also: KCR Targets Modi: మరింత ఘాటుగా..
ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కార్ఫరెన్స్ ద్వారా చర్చలు జరగనున్నాయి.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాల పరిష్కారంపై ఈ సబ్ కమిటీ చర్చించనుంది.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం… ఆర్ధిక అంశాలపైనే చర్చ జరగనుంది.. ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.. మొదట అజెండా 9 అంశాలుగా ఉన్నా.. దానిని 5 అంశాలకే పరిమితం చేసింది హోంశాఖ.. ఇక, కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది..