Dhulipalla Narendra: శాసనసభలో ఇదే తొలిసారి..!
- కొత్త స్పీకర్ చైర్‌లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి
- టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు
- బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారు
- ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారినిరూపించారని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhulipalla Narendra: కొత్త స్పీకర్ చైర్‌లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారని.. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారి జగన్ నిరూపించారు.. స్పీకర్ ఛార్జ్ తీసుకుంటుంటే మాజీ సీఎం జగన్ కానీ.. వైసీపీ సభ్యులు కానీ లేకపోవడం బాధాకరం అని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.. గతంలో మాకు ఎంత బాధ ఉన్నా సంప్రదాయాన్ని గౌరవించాం. ఆయన (వైఎస్ జగన్) పులివెందుల వెళ్తే.. కనీసం వైసీపీ సభ్యులైనా సభకు వచ్చుంటే బాగుండేదన్నారు. పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చాం. జగన్ తనకిచ్చిన గౌరవాన్ని నిలుపుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పునూ వైసీపీ గౌరవించడం లేదన్నారు.
Read Also: Mallikarjun Kharge: తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ఇక, జగన్ తనకు లేని హోదాను కోరుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చాం. సభకు రాకుండా ఉండడానికి జగన్ సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల.. ఓటమిని జీర్ణించుకునే పరిస్థితుల్లో జగన్ లేరన్న ఆయన.. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నప్పుడు అచ్చెన్నాయుడు ఆయన్ను చైరులో కూర్చొపెట్టడానికి వెళ్లారని గుర్తుచేశారు.. పరిటాల రవిని చంపినప్పుడు సభలో మేం ఆందోళన చేయాలనుకున్నాం. కానీ, చంద్రబాబు వద్దన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాం.. వ్యవస్థలను గౌరవించాం. కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వాకౌట్ చేశారు.. ఇదీ ఫస్ట్ టైమే అన్నారు. నిన్న జగన్ సభలోకి వచ్చినప్పుడు మా సభ్యులెవరు ఒక్క మాట కూడా అనలేదు.. అది మా హుందాతనం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?