Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. తనను కలిసి.. సమస్యలు చెప్పుకోవాలనుకునే వారికి ప్రజా దర్బార్ ఓ వేదిక అని పేర్కొన్నారు.
Read Also: YS Jagan Convoy: జగన్ కాన్వాయ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం..
అసెంబ్లీ లాబీలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు – మంత్రి లోకేష్ చిట్ చాట్‌గా మాట్లాడారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్టు పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును నారా లోకేష్ అడిగారు. ఈ క్రమంలో రెండేళ్లలో పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. రెండేళ్లా..? ఇంక త్వరగా పూర్తి చేసేయండని రామ్మోహన్నాయుడును మంత్రి లోకేష్ కోరారు. ప్రయత్నిస్తానంటూ రామ్మోహన్నాయుడు రిప్లై ఇచ్చారు.