AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్ చేయించారు. గత ప్రభుత్వం గేట్-2 మూసేసి నిర్మించిన గోడను పడగొట్టించి గేట్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు. గేట్-2 నుంచి ఎవ్వరూ రాకుండా కట్టిన గోడని తొలగించి, గేటుని తెరిపించామన్నారు. అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాసౌమ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో గేటు-2 ని మూసేశారని వెల్లడించారు. ప్రజల తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజాసౌమ్య వ్యవస్థలో ప్రజాసౌమ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం, ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
Read Also: Janasena: రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం