రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వాడీవేడీగా సాగిన సమావేశాలు.. మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీలో కాకరేపింది.. ఇక, రెండో రోజు కూడా రసవత్తరమైన చర్చ జరగనుంది.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
సీఎం జగన్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు.
2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.14వేల కోట్లు మాత్రమే.. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.59వేల కోట్లకు ఎగబాకాయి.. చంద్రబాబు హయాంలో అప్పులు ఏకంగా 123.52 శాతం పెరిగాయి.. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.69 లక్షల కోట్లు.. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.82 లక్షల కోట్లు.. మూడేళ్లలో రాష్ట్ర రుణం 41.83 శాతం పెరిగింది-సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందన్నారు సీఎం వైఎస్ జగన్... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు.. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయి.. కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా.. దేశంలోని చాలా రాష్ట్రాల కంటే బాగా ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నామన్నారు..
వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తానే కట్టానంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి అమర్‌నాథ్.. సెల్‌ఫోన్లు తానే కనిపెట్టానంటారంటూ ఎద్దేవా చేసిన ఆయన... టీడీపీ హయాంలో ప్రాజెక్టులు వచ్చింది లేదు.. పైగా ఉన్నవే మూతబట్టారన్నారు..
శాసనసభలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు.. ఇక, స్పీకర్ టేబుల్ గట్టిగా చరిచారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని.. దీంతో, ఒక్క రోజు పాటు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయ్యింది.. ఆ తర్వాత అసెంబ్లీకి టీ బ్రేక్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం... టీ బ్రేక్ తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశం కానుంది.
ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని విడదల రజని అన్నారు. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయమన్నారు.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్‌నూ తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగిందని విడదల రజని తెలిపారు.
టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారని అన్నారు. రూ. కోటికి పైగా ఖర్చు చేసి రథాన్ని తయారు చేశామన్నారు. రూ. 3 కోట్లతో రామతీర్థం ఆలయాన్ని పునరుద్ధరించామని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారన్నారు. చంద్రబాబు షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రెండో రోజు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్ తమ్మినేని. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు పెట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. 480 ఎకరాలకు రూ. 37 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా? అంటూ సీరియస్ అయ్యారు మంత్రి బుగ్గన.
పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాశారు. కడప స్టీల్‌ప్టాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తొలిరోజు వాడీవేడీగా సాగిన ఆంధ్రప్రదేశ్ సమావేశాలు.. రెండో రోజు ప్రారంభం అయ్యాయి.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..