ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అంతేకాకుండా ఓటీఎస్ వసూళ్లు, జిల్లాల విభజన ఆందోళనలపై టీడీపీ ప్రశ్నలు సంధించనుంది. అటు టీడీపీ ప్రభుత్వం హయాంలో కూల్చేసిన దేవాలయాలపై వైసీపీ సభ్యులు కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.