AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజే వాడీవేడీ చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతుంది.. మృతిచెందిన ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మాణాలు ప్రవేశపెట్టనున్నారు స్పీకర్.. ఇక, మూడు రాజధానులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది… మరోవైపు పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ సాగనుంది.. అయితే, మొదటి రోజే మూడు రాజధానులపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో.. తొలి రోజు నుంచే ఏపీ ఉభయ సభల్లో వాడీవేడీ చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల పని దినాలు, అజెండా ఖరారు చేయనున్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
మూడు రాజధానులపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ సాగనుంది.. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.. అయితే, మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ సవాల్ చేసింది… వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటోంది ప్రభుత్వం.. ఉభయ సభల్లో జరిగే ప్రశ్నోత్తరాల్లో కీలక అంశాలపై చర్చ సాగనుంది.. మరోవైపు.. ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చిచింది తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్.. యువతను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలుగు యవత, టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు దిగనున్నాయి.
ఇక, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే..
* ఆర్బీకేలు, ఖరీఫ్ పంటనష్ట పరిహరం, ఎస్సీ విద్యార్థుల స్టడీ సర్కిళ్లు.
* ప్రమాదకర స్థితిలో శ్రీశైలం ప్రాజెక్టు, గిరిజన సహకార సంఘాలు, రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు.
* రజకులు-దర్జీలు-నాయీ బ్రహ్మాణులకు ఆర్థిక సాయం, పీఎంజీఎస్‌వై బిల్లుల చెల్లింపు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విదేశీ విద్యా దీవెన పథకం.
మండలిలో ప్రశ్నోత్తరాలు:
* పారిశ్రామిక హబ్‌లు, నిత్యావసరాల ధరలు, ఓడరేవులు, ఫిషింగ్ హర్బర్లు,
* ఆరోగ్య శ్రీ బిల్లులు, నరేగా పనుల పురోగతి, గండికోట నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్.
* డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు, భూముల మార్పిడి
* వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ, మినీ అంగన్ వాడీ కేంద్రాలు
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!