బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ అన్న మాటకు అసలైన అర్థం చెప్పిన మహానటులు తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ అనే చెప్పాలి. వారిద్దరూ తెలుగు బాక్సాఫీస్ ను ఓ వెలుగు వెలిగించారు. ఈ రోజున అందరూ తమ చిత్రాలు ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయని గర్వంగా చెప్పుకుంటూ సాగుతున్నారు. కానీ, ఆ మాటకు అసలు సిసలు అర్థం చెప్పిన వారు కూడా ఆ ఇద్దరు మహానటులే! ఇక అసలు విషయానికి వస్తే, యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు బాక్సాఫీస్…
(ఏప్రిల్ 2తో ‘బంగారు కానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రాలలో ఎవర్ గ్రీన్ అంటే ‘ప్రేమాభిషేకం’ చిత్రమే! ఆ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఏయన్నార్, శ్రీదేవి కాంబోలో మరికొన్ని చిత్రాలు వెలుగు చూశాయి. అయితే అవేవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేక పోయాయి. ‘ప్రేమాభిషేకం’ తరువాత ఏయన్నార్, శ్రీదేవి నటించిన చిత్రాలు వచ్చాయి. కానీ, వాటిలో వారిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకానుక’. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం…
(ఫిబ్రవరి 17న ‘రైతు కుటుంబం’కు 50 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు రైతు నేపథ్యగాథలు తెరకెక్కాయి. వాటిలో అనేకం విజయపథంలో పయనించాయి. ఏయన్నార్ నటించిన ‘రైతు కుటుంబం’ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. 1972 ఫిబ్రవరి 17న ‘రైతుకుటుంబం’ విడుదలైంది. ‘రైతు కుటుంబం’ టైటిల్ లోనే కథ తెలిసిపోతోంది. ఓ రైతు పెద్ద కొడుకు జోగయ్య ఇల్లు పట్టించుకోకుండా పేకాట ఆడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. జోగయ్య భార్య అన్నపూర్ణ తన కూతురుతో పాటు మరదులు…
(ఫిబ్రవరి 16న ఏయన్నార్ ‘ఆరాధన’కు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు ఉన్న అనుబంధం ఎనలేనిది. జగపతి బ్యానర్ లో ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆ సంస్థ లో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం ‘ఆరాధన’. 1962 ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం ‘సాగరిక’ అనే బెంగాలీ సినిమా ఆధారంగా రూపొందింది. రీమేక్స్ తీయడంలో మేటి అని తరువాతి రోజుల్లో పేరు…
(డిసెంబర్ 9తో శభాష్ రాజాకు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పి.రామకృష్ణ దర్శకత్వంలో రాజశ్రీ సంస్థ నిర్మించిన శభాష్ రాజా చిత్రం 1961 డిసెంబర్ 9న విడుదలయింది. ఏయన్నార్ సరసన రాజసులోచన నాయికగా నటించిన శభాష్ రాజా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించారు. శభాష్ రాజా చిత్ర కథ, అంతకు ముందు ఏయన్నార్ తో సుందర్ లాల్ నహతా నిర్మించిన శాంతి నివాసం కథను పోలి ఉంటుంది.…
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు. అయితే దాని కంటే ముందుగా…
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు.…
గ్యాడ్జెట్స్ మీద కొంతమందికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదయా! రకరకాల ఫోన్లు వాడాలని కొందరు తపిస్తుంటారు. తారలు సైతం అందుకు మినహాయింపేమీ కాదు. యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి కూడా అలాంటి అలవాటే ఉంది. మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తే చాలు – దానిని పట్టేయాలని చూస్తారు. నచ్చిందో… అంతే సంగతులు – దానిని కొనేసి ప్యాకెట్ లో పెట్టేసుకుంటాడు. అదీ అఖిల్ పంథా. అయితే ఏ సెల్ ఫోన్ కొన్నా, అందులో…