Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో 'నట పంచపాండవులు'గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు.
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.
Director Krishna: నటశేఖరునికి దర్శకత్వం పైనా ఎప్పటి నుంచో అభిలాష ఉంది. ఏడాదికి పదికి పైగా చిత్రాలలో నటిస్తూ వచ్చిన కృష్ణ చిత్రసీమకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ పట్టు సంపాదిస్తూ వచ్చారు.
Prathibimbalu: మహానటుడు అక్కినేని 40 సంవత్సరాల క్రితం నటించిన 'ప్రతిబింబాలు' సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయింది. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాను రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో 2కె హెడి రిజల్యూషన్ తో విడుదల చేయబోతున్నారు.
ఎండయినా, వానయినైనా, చలి అయినా – ఏదో ఒక రూపేనా మనిషిని కదలించి వేస్తుంటాయి. వానకు పరవశించి పోవడం ఓ చోట – వరదకు కుంగిపోవడం మరో చోట కనిపిస్తుంది. చెమటలు కక్కించే ఎండల్లోనూ హుషారుగా సాగేవారు కొందరయితే, ఎండదెబ్బకు అనారోగ్యం పాలు కావడమూ కనిపిస్తుంది. చలిలో గిలిగిలికి గురయ్యేవారు కొందరయితే, ఆ చలి తీక్షణమై చితికిపోయినవారూ ఉంటారు. ఇలా అన్ని కాలాలు కొందరికి ప్రమోదం, మరికొందరికి ప్రమాదంగా పరిణమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆగని వానలకు కొన్ని…
తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ…
నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో…
(ఏప్రిల్ 9తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 35 ఏళ్ళు) మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన చిత్రాలలో తొలి సూపర్ హిట్ గా నిలచిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. బి.గోపాల్ దర్శకత్వంలో ఏయన్నార్ పెద్ద అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ 1987 ఏప్రిల్ 9న విడుదలయి, విజయఢంకా మోగించింది. ‘కలెక్టర్ గారి అబ్బాయి’ కథ ఏమిటంటే – రమాకాంతరావు అనే కలెక్టర్ నీతి, నిజాయితీలే ప్రాణంగా జీవిస్తూ…