గ్యాడ్జెట్స్ మీద కొంతమందికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదయా! రకరకాల ఫోన్లు వాడాలని కొందరు తపిస్తుంటారు. తారలు సైతం అందుకు మినహాయింపేమీ కాదు. యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి కూడా అలాంటి అలవాటే ఉంది. మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తే చాలు – దానిని పట్టేయాలని చూస్తారు. నచ్చిందో… అంతే సంగతులు – దానిని కొనేసి ప్యాకెట్ లో పెట్టేసుకుంటాడు. అదీ అఖిల్ పంథా. అయితే ఏ సెల్ ఫోన్ కొన్నా, అందులో వాల్ పేపర్ గా తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఫోటోనే పెట్టుకోవడం అఖిల్ కు అలవాటు. ఇటీవల అఖిల్ ఓ లేటెస్ట్ ఫోన్ కొన్నాడు. అందులో కూడా తనకు నచ్చిన తాతయ్య పిక్ ను పెట్టేశాడు.
Read Also : రిగ్గింగ్ అంటూ అనసూయ ట్వీట్… ‘మా’ ఎన్నికల అధికారి రియాక్షన్
అఖిల్ ను అంతగా ఆకట్టుకున్న తాతయ్య ఫోటో ఏది? ఓ బ్లాక్ అండ్ వైట్ ఏయన్నార్ పిక్ అఖిల్ ను ఆకట్టుకుంది. అందులో ఏయన్నార్ బ్లాక్ కోట్ వేసుకొని, బౌ టై పెట్టుకొని చెలాకీగా చూస్తూ ఉన్నారు. ఆ మధ్య ఏయన్నార్ జయంతి సందర్భంగా అక్కినేని అభిమానులు ఏర్పాటు చేసిన ఏయన్నార్ ఫోటో ఎగ్జిబిషన్ లోనూ ఆ ఫోటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదే విధంగా ఏయన్నార్ సొంత మనవడు అఖిల్ కూడా ఆ ఫోటోకు ఎట్రాక్ట్ అయ్యాడు. అప్పటి నుంచీ తాను ఏ సెల్ ఫోన్ కొన్నా అందులో వాల్ పేపర్ గా తన తాతయ్య ఫోటోనే పెట్టుకోవడం హాబీగా చేసుకున్నాడు అఖిల్. అదీ గ్రేట్ లెజెండ్ గ్రాండ్ ఫాదర్ పై ఈ మనవడికి ఉన్న ప్రేమ, అభిమానం!