Anjali Devi:అంజలీ దేవి పేరు వినగానే ఆ తరం ప్రేక్షకులకు 'సీతమ్మ' అనే గుర్తుకు వస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'లో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఈ నాటికీ బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో!
“వింటే భారతం వినాలి… తింటే గారెలే తినాలి…” అని నానుడి. రామాయణ, భారత, భాగవతాలు మన భారతీయులకు పవిత్రగ్రంథాలు. ఈ పురాణగాథల ఆధారంగానే భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రాణం పోసుకోవడం విశేషం! తరువాతి రోజుల్లో భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగులో రూపొందిన యన్టీఆర్ పౌరాణికాలు ఇతర భాషల్లోకి అనువాదమై అలరించాయి. భారతగాథకు అసలైన నాయకుడు అనిపించే భీష్ముని గాథతో…
(జూన్ 25తో ‘కళ్యాణమంటపం’కు 50 ఏళ్ళు) రీమేక్స్ రూపొందించడంలో కింగ్ అనిపించుకున్నారు దర్శకుడు వి.మధుసూదనరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ మంటపం’ చిత్రానికి కన్నడలో పుట్టన్న కణగల్ రూపొందించిన ‘గజ్జె పూజె’ ఆధారం. కన్నడలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో కాంచన పోషించారు. ఇందులో శోభన్ బాబు కాంచన ప్రియుని పాత్రలో నటించారు. 1971 జూన్ 25న విడుదలైన ‘కళ్యాణ మంటపం’ ఆ రోజుల్లో మంచి ఆదరణ పొందింది.దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ…