వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘కలర్ ఫొటో’ మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.…
‘సంక్రాంతి అల్లుళ్లు’ విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్… ఈసారి ‘సమ్మర్ సోగాళ్ళు’గా మారిపోయారు. అయితే… వాళ్ళు సమ్మర్ కైనా వస్తారా అనే సందేహాన్ని ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్ ఫాన్ నాగరత్తమ్మ (సునయన) వ్యక్తం చేస్తోంది. కొత్త సంవత్సరంలో ‘ఎఫ్ 2 ఫ్రాంచైజ్’ ఫ్యాన్స్ కు విషెస్ తెలియచేస్తూ, అనిల్ రావిపూడి ఓ సరదా వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో వదిలాడు. సంక్రాంతి పండగ అంటే అరిసెలు, పూతరేకులు కంపల్సరీ! వాటిని తయారు చేసుకుని నాగరత్తమ్మ, అనిల్ రావిపూడి…
2022 సంక్రాంతి క్లాష్ కు చెక్ పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ తరువాత ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు కూడా పవన్ కోసం వెనకడుగు వేయక తప్పలేదు. ‘భీమ్లా నాయక్’ కోసం తన సినిమా విడుదల తేదీని త్యాగం చేసేశారు దిల్ రాజు. ‘భీమ్లా నాయక్’తో పాటు ‘ఎఫ్3’ కూడా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన “ఎఫ్3: ఫన్…
ఈరోజు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజును అభిమానులు సోషల్ మీడియాలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ “ఎఫ్ 3” మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేష్ తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్‌గా ప్రదర్శించారు.…
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్ఫామ్లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా…
‘పటాస్’ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఒక చిత్రాన్ని మించిన విజయాన్ని మరో చిత్రంతో అందుకుంటూ ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. ఈ ఆరేళ్ళలో అనిల్ దర్శకత్వం వహించింది కేవలం ఐదు చిత్రాలే అయినా, తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం…
పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. అనిల్ రావిపూడి 1982 నవంబర్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇతర భాషల చిత్రాల రీమేక్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రిష్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా చేస్తున్నాడు. తాజా బజ్ ఏమిటంటే దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. అయితే కథ విషయంలో అనిల్‌కి పవన్ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రావద్దని, ఎఫ్ 2, ఎఫ్ 3…