నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచి, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసిన బాలయ్య ‘NBK 108’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ బాలయ్య గేర్ మార్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘వీర సింహా రెడ్డి’ ప్రమోషన్స్ కి బాలయ్య రెడీ అవుతూనే ‘NBK108’ సినిమా స్టార్ట్ చేశాడు. ఈరోజు ‘NBK108’ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది.
‘NBK 108’కి సంబంధించిన ఓపెనింగ్స్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం, ఒక్క ఫొటోనే. పూజా కార్యక్రమాలు చేసిన ప్రాంగణంలో కొన్ని సినిమాల పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఒక ఫోటోగా చేశారు. ఈ ఫోటో చూసిన వాళ్లు… ఫ్రేమ్ లో ఉన్న ప్రతి పోస్టర్ బాలకృష్ణ, ఎన్టీఆర్ లు కలిసి నటించిన సినిమాలవి కావడం విశేషం. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమాల పోస్టర్స్ మాత్రమే ఒక దగ్గర ఎందుకు పెట్టాడు అంటూ నందమూరి అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఏ హీరో సినిమా ఓపెనింగ్ అయినా, అతనికి సంబంధించిన సినిమాల పోస్టర్స్ పెట్టడం మాములే కానీ ఇలా ప్రత్యేకంగా ‘ఎన్టీఆర్’తో బాలయ్య నటించిన సినిమాల పోస్టర్స్ మాత్రమే ఎందుకు పెట్టారు అనేది ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఇదిలా ఉంటే బాలకృష్ణని ముందెన్నడూ చూడని అవతారంలో చూపించబోతున్నని చెప్పిన అనీల్ రావిపూడి మొదటి షెడ్యూల్ ని ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయనున్నాడు. జైలు సెట్ లో ఈ ఫైట్ జరగనుందని సమాచారం. NBK 108 సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.