Balakrishna : అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలయ్య కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు. అఖండ అందించిన బూస్ట్ తో బాలకృష్ణ ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇటీవలే ఈ భారీ యాక్షన్ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నందమూరి నటసింహం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మరింత పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఈ మూవీని 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకురాబోతున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటి హనీ రోజ్, కన్నడ నటుడు దునియా విజయ్ లాల్ రవిశంకర్ చంద్రిక రవి నటిస్తున్నారు.
Read Also: Sania Mirza Divorce: షోయబ్‌తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ?
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ‘రామారావు గారు’ అనే మూవీని చేయబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాతలు హరీష్ పెద్ద సాహు గారపాటి నిర్మించనున్నారు. ఇందులో బాలయ్య సరసన దబాంగ్ బ్యూటీ సొనాక్షీసిన్హాని హీరోయిన్ గా తెలుగు తెరకు డైరెక్టర్ పరిచయం చేయబోతున్నాడని తెలిసింది. శ్రీలీల, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:Kalyan Ram: ఆసక్తి రేపుతున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్