నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ లో ఉన్నాడు. ఆయన సినిమాలు చేసినా, షోస్ చేసినా ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు నందమూరి అభిమానులకి మాత్రం పరిమితం అయిన జై బాలయ్య అనే స్లోగన్ ఇప్పుడు, స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయిపొయింది అంటే బాలయ్య క్రేజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ముందెన్నడూ లేనంత ఎనర్జీతో ఉన్న బాలకృష్ణ, ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా కంప్లీట్ చేసి, ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి సినిమా సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ అనీల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేశాడు. కామెడి జానర్ లో సినిమాలు చేసే దర్శకుడికి, ఫైర్ హౌజ్ లాంటి యాక్షన్ సినిమాలు చేసే బాలయ్య ఎక్కడ సెట్ అవుతుందా అని అందరూ షాక్ అయ్యారు. అయితే బాలయ్య మాత్రం వెనక్కి తగ్గకుండా NBK 108 సినిమాని అనుకున్న దానికన్నా ముందే సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా ఉన్నాడు.
Read Also: Drishyam 2 box office collection: డే3 > డే1… వంద కోట్ల ‘దృశ్యం’
NBK 108 అనౌన్స్ అయ్యి చాలా రోజులే అయినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వీర సింహా రెడ్డి రిలీజ్ అయ్యాకే ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్లందరికీ షాక్ ఇస్తూ, బాలయ్య NBK 108 సినిమా ఓపెనింగ్ సెరిమొనిని డిసెంబర్ ఎనిమిదిన చేయడానికి డిసైడ్ అయ్యాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరక్కనున్న ఈ సినిమాతో బాలయ్య మొదటిసారి నార్త్ ని వెళ్తున్నాడు. నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేసిన అనిల్ రావిపూడి NBK 108 సినిమాలో విలన్ గా అర్జున్ రాంపాల్ ను తీసుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. హీరోయిన్ విషయంలోనే ఇంకా ఎలాంటి వార్త బయటకి రాలేదు. NBK 108 టీం దాదాపు హిందీ హీరోయిన్ నే రంగంలోకి దించే ఛాన్స్ ఉంది.