మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్‌లో వైస్‌ఛైర్‌పర్సన్‌గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా ఎయిర్‌పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. అంతేకాకుండా చేతికి దొరికిన వస్తువుల్ని విసిరేసింది. అరుపులు, కేకలతో నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో…
ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన ఘటన కాన్పూర్ లో జరిగింది. మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. ప్రభుత్వ అధికారిపై కోపంతో ఫైలు విసిరింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్ ప్రమీలా పాండే డ్రైనేజీ వ్యవస్థల పరిశుభ్రత, ఇతర సంబంధిత విషయాల గురించి కాన్పూర్ నగర్ నిగమ్ సమావేశానికి హాజరయ్యారు. డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు.
జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తామంటుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.