Jagga Reddy: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై ఫైర్ అయిన జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని లక్ష్మణ్ అనడం ఆయన అవగాహన రాహిత్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావచ్చు.. బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్‌లో మొదటి ర్యాంక్. మోడీ ఇచ్చిన హామీలపై మా ఎంపీ అనిల్‌తో చర్చకు రండి. బీజేపీ నేతలు శివలింగం మీద పాములాంటి వాళ్లు.. అందుకే ప్రజలు మొక్కుతున్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే పడుతుంది.’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Raai Laxmi: అబ్బా.. రత్తాలు కొత్త లుక్ అదిరిపోయింది..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
- Raviteja: 'ఇరుముడి' విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
‘‘గతంలో ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పోలీసులను వాడుకునేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల కమిషన్‌కి సహకారం ఇచ్చింది . ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.. ఈ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది, సీఎం రేవంత్‌రెడ్డిది. సోమవారమే ఎన్నికలు అయిపోయాయి .. ప్రెస్‌మీట్ ఎందుకులే అనుకున్నా.. కానీ బీజేపీ లక్ష్మణ్ అనవసరంగా మాట్లాడారు. ప్రజలు.. అంతా రిలాక్స్ అయ్యారు. కొంపలు మునిగినట్టు.. లక్ష్మణ్ మాట్లాడటం సరికాదు. లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీనా.. జోతిష్యం చెబుతున్నారా..? మూడు నెలల్లో ఏదో జరుగుతుంది అని మాట్లాడటం అవసరమా? ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతుంది అని అంటున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. ఆగస్టు సంక్షోభం అనేది.. ఒట్టి మాట. కాంగ్రెస్‌కి 64 మంది ఎమ్మెల్యేలతో అధికారం ఇచ్చారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు.. బస్సులో మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు.. గ్యాస్ 500కి వస్తుంది. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం చెప్పారు.’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Snacks: 5 రూపాయిల కుర్కురే కొనివ్వలేదని భర్తను వదిలేసిన అర్ధాంగి
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!