Nani : మనిషి అన్న తర్వాత అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. వాటన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన ఎమోషన్ కోపం. కొంతమంది కోపం వస్తే అణుచుకోగలుగుతారు. కొంతమంది మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేక చేతికి ఏది దొరికితే దానిని ధ్వంసం చేస్తారు. కోపం వస్తే కొంతమంది మాత్రం పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. మరికొంత మందిలో ఆ కోపం వెంటనే తగ్గిపోతుంటుంది. దీనినే ముక్కు మీద కోపం..మూతి మీద కోపం అంటుంటారు. మరి నేచురల్ స్టార్ నాని కోపం ఎలాంటింది అంటే? రెండో రకం అని చెబుతుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నానికి కోపం వచ్చినా ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నెక్ట్స్ మినిటే ఆ కోపం కరిగి పోతుందిట. ఇలా కరిగి పోవడమే తన బలహీనతగా చెప్పుకొచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసినా ఆ క్షణం కోపం వచ్చినా ? వెంటనే కొవ్వొత్తిలా కరిగిపోతుందన్నాడు. అంతేకానీ వాళ్లేదో అన్నారని…వాళ్ల మీద పగ పెంచుకోవడం..ప్రతీకారం తీర్చుకోవడం.. ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేయడట.
Read Also:Amaran : ఆ హీరోయిన్ ‘అన్న’ అంది.. ఎంతో బాధపడ్డాను! స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇలా కోపం చల్లారపోవడం అన్నది కొంత మందిలో గొప్ప లక్షణంగా చెప్పొచ్చు. పగలు..ప్రతీకారాలతో సాధించేది ఏమీ ఉండదు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం తప్పు. నాని మనస్తత్వం కూడా అలాంటిదేనట. వెరీ కామ్ గోయింగ్ పర్సన్. ఎలాంటి వివాదాల్లో వేలు పెట్టడు. తన పని తాను చూసుకుని వెళ్లిపోతాడు. ఇతరుల విషయాల జోలికి వెళ్లనే వెళ్లడు. చాలా జోవియల్ గా ఉంటాడు. నవ్వితే నవ్వుతాడు. పలకరిస్తే హాయ్ అంటాడు. ఇంతకు మించి ఎదుట వారు ఆశించేది ఏముంటుంది? అందుకే స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిపోదా శనివారం’తో మరో బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో ఇటీవలే మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Read Also:IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే