రేపు వరుస కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8 మంది ఐఏఎస్‌లకు వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది.
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు.
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు కసరత్తు వేగంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదన్నారు.
న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో పెద్దపులి మృతి చెందినట్లు తెలుస్తోంది. మాచర్ల సమీపంలోనీ లోయపల్లి అటవీ ప్రాంతం వద్ద జంతువు కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.