లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ తెలిపింది.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి స్పష్టం చేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పిందని, మళ్ళీ పోటీ చేసి గెలవడం ఖాయమని అన్నారు.
మాజీ మంత్రి, కాపు సంక్షే సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండో మాటలేదు.. "అనుభవస్తుని నాయకత్వమే ఈరాష్ట్రానికి కావాలి" అని పవన్ కళ్యాన్ అనేక సార్లు ప్రకటించారు.. కనుక అందరి మాట ఇదే అంటూ" లోకేష్ ప్రకటించేశారని ఆయన లేఖలో తెలిపారు.
నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు.
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా తమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహించనుంది.
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.