IAS Transfers in AP: ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8 మంది ఐఏఎస్‌లకు వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. అందులో 9 మంది ఐఏఎస్‌లకు బదిలీలు కాగా.. 8 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం.
పోస్టింగ్‌లు ఇవే..
*స్పోర్ట్స్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా ధ్యాన్‌చంద్ర
*విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్‌గా టీఎస్ చేతన్
*బీసీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా జె.శివ శ్రీనివాస్
*తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా శుభం బన్సాల్
*విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ
*సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్&ఏడీగా అభిషేక్ కుమార్
*అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్&ఏడీగా కె.కార్తీక్
*మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్‌గా ఎస్‌ఎస్ శోభిక
*పాడేరు సబ్ కలెక్టర్‌గా పెద్దేటి ధాత్రిరెడ్డి
*ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ సీఈవోగా మాధవన్
*పెనుగొండ సబ్ కలెక్టర్‌గా అపూర్వ భరత్
*ఆదోని సబ్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ
*రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా సూరపాటి ప్రశాంత్‌కుమార్
*మార్కాపూర్ సబ్‌కలెక్టర్‌గా రాహుల్‌మీనా
*తెనాలి సబ్ కలెక్టర్‌గా ప్రకార్‌జైన్
*కందుకూరి సబ్ కలెక్టర్‌గా గొబ్బిల విద్యాధరి
*కొవ్వూరు సబ్ కలెక్టరుగా అసుతోష్ శ్రీవాస్తవ.