Buddha Venkanna: కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు..అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని ఆరోపించారు. కేశినేని నాని అప్పుల అప్పారావు అని.. టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని కొందరు దగ్గర అప్పులు చేశాడని ఆరోపణలు చేశారు. కేశినేని నానికి అప్పు ఇవ్వడమంటే.. గోడకు కొట్టిన సున్నం లాంటిదేనని విమర్శించారు. మైలవరం వైసీపీ ఇంఛార్జిగా ఉండి కూడా డబ్బులు కొట్టేసి ఉంటాడన్నారు. కేశినేని నానిని రోడ్ల మీదకు వదిలేటప్పుడు కేశినేని నాని అప్పులను జగనే తీర్చాలని.. అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళ్తే.. అప్పుల వాళ్లు నాని వెంటే ఉంటారని ఎద్దేవా చేశారు. తాను టీడీపీ నేతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చాల్సి వస్తుందనే నాని పార్టీ మారారని ఆయన ఆరోపించారు.
Read Also: Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసు.. దర్యాప్తులో సంచలన నిజాలు
కేశినేని నాని వెనుక టీడీపీ నేతలే కాదు.. ఆయన ఫ్యామిలీ కూడా లేదన్నారు. కేశినేని నానికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం కూడా డౌటేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై లేనిపోని నిందలేస్తున్నారని కేశినేని నానిపై మండిపడ్డారు. కేశినేని నాని సత్య హరిశ్చంద్రుడైనట్టు పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని.. చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని చెప్పేశాడని పెద్దిరెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారన్నారు.