MRO Killed: విశాఖలో అర్ధరాత్రి దుండగులు చెలరేగి పోయారు. విజయనగరం జిల్లా బంటుమిల్లి తహాసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డులతో తలపై కొట్టి పరారయ్యారు దుండగులు. కొమ్మాదిలోని తహశీల్దార్ రమణయ్య నివశిస్తున్న అపార్ట్ మెంట్‌లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే తహసీల్దారును అపోలో హాస్పటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: YSRCP: విజయవాడలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్
తహసీల్దార్ రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వోగా రమణయ్య పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రమణయ్య చేరుకున్నారు. రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి తహసీల్దార్ కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్‌గా సంభాషణ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రమణయ్య. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు. కొమ్మాదిలో చరణ్ క్యాస్టాల్ అపార్ట్మెంట్ లో ఐదో ఫ్లోర్‌లో తహశీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు.
Read ALso: Students Died Abroad: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మరణం.. ఎక్కువగా కెనడాలోనే..
రూరల్ కార్యాలయంలో పని చేసినప్పుడు భూ వివాదాలలో కఠినంగా వ్యవహరించే అధికారిగా రమణయ్యకు గుర్తింపు వుంది. దీంతో దాడి వెనుక భూవివాదమే కారణం అయి వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సంఘటన స్థలాన్ని 1.30గంటల సమయంలో సీపీ రవిశంకర్ అయ్యన్నార్ చేరుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. విశాఖ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. తహసీల్దార్ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి.