గోదావరి ఉప్పొంగడంతో గ్రామాల్లోని హ్యాండ్ పంపుల నుంచి ఉబికి ఉబికి వస్తోంది నీరు. చేతితో కొడితేనే సాధారణంగా నీరు వస్తుంది కానీ. ఇప్పుడు వర్షాలు, వరదల కారణంగా హ్యాండ్ పంపుల నుంచి ఏకధాటిగా నీరు వస్తోంది. గోదావరికి సమీపాన వున్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా…
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో వరద ప్రవాహం ‘ప్రమాద’కరంగా పెరుగుతోంది. ఒక్కో అడుగూ పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 13.3 అడుగుల వద్దకు చేరింది. దీంతో మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు మొదటి…