Maoists Letter on Floods: వరద బాధితుల్ని ఆదుకోండి.. మావోయిస్టుల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్గం వాటిల్లింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెండు ప్రభుత్వాలకు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని లేఖలో పేర్కొంది.
ఇరు రాష్ట్రాల్లో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. బీకే-ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. భారీవర్షాలు, గోదావరి వరదల వల్ల వేలాదిమంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావం వల్ల ఇళ్ళను కోల్పోయారు. ఇదిలా వుంటే.. వరద నష్టంపై అధ్యయనానికి కేంద్ర బృందం రానుంది. ఢిల్లీ నుంచి తెలంగాణకు 6 గురు సభ్యుల బృందం రాబోతోంది. వరదల నష్టాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది బృందం. 2 రోజుల పర్యటనలో భద్రాచలం, కడెం ప్రాజెక్టులను పరిశీలించనుంది కేంద్ర బృందం.
Also Read
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
మరోవైపు భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, భవనాలు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలో రూ. 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది. తక్షణమే రూ. 1000 కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరింది.రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూ.33 కోట్లు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ.379 కోట్లు.. విద్యుత్ శాఖలో రూ. 7 కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. భద్రాచలం కింద వున్న విలీన గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ సీఎంలు ఏరియల్ సర్వేల ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియాగాంధీ.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!