ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్వాహకులు జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలిచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అశ్లీల ఫొటోలు పంపి మరింత ఇబ్బందులకు గురిచేసే ఘటనలు పేట్రేగుతున్నాయి. తీసుకున్న రుణానికి ఒక్కోసారి రెండు నుంచి నాలుగు రెట్ల సొమ్మును వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల…
గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు అమెరికా కాన్సుల్ జనరల్ ( హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్. జోయల్ రీఫ్‌మెన్ తన ఫేర్‌వెల్ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు మెరుగుపరచడం కోసం, అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి అమెరికన్ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం చేసిన కృషిని కొనియాడారు. విద్యా…
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను బదిలీ చేయగా.. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ… టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు. క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు… రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్… లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు…
అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…
పొలిటికల్ అటెన్షన్ కోసం బీజేపీ ఆపసోపాలు ఏపీలో బలపడేందుకు నానా తంటాలు పడుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారాలని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తోంది. కానీ.. అవేమీ వర్కవుట్ కావడం లేదు. రెండు మూడు రోజులకే వేడి చల్లారిపోతోంది. తర్వాత వాటి గురించి.. బీజేపీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. దీంతో ప్రజల్లో పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చేందుకు ఏం చేయాలో కమలనాథులకు పాలుపోవడం లేదట. ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదా? ప్రస్తుతం…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ఏర్పాటు పై గడ్కరీతో చర్చించారు. విశాఖలో 6 లేన్ల రహదారిని,విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి అంశంపై చర్చించారు. విజయవాడ…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రంగా రూపు మారుతోందని, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు పెట్టామన్నారు. గతంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాలను అలాగే కాపాడాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్ లో…
* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…